చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు
అశ్వరావుపేటఅర్సీ, సెప్టెంబర్ 26( జనం సాక్షి )
భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించాలని రజక వృత్తిదారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు అన్నారు ఐలమ్మ జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు అశ్వరావుపేట పట్టణంలో ముందుగా ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో ఐలమ్మ పటానికి పూలమాలలు వేశారు అనంతరం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ రజకులకు చట్టసభలలో అవకాశం కల్పించాలని అదేవిధంగా రజక బంధు ప్రతి కుటుంబానికి వర్తింపచేయాలని బట్టలు ఉతకటానికి రజకులకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వర్తింపచేయాలని ఇంటి స్థలాలను కేటాయించాలని అదేవిధంగా దేవాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆసుపత్రి నందు రజకులకు వారి చేసే పనిని వారికి అవకాశం కల్పించాలని రజకులను కించపరచకుండా ప్రత్యేక చట్టం తీసుకువచ్చే దానికోసం అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అంతేకాకుండా ప్రతి ఒక్క రజకుడు వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాట పటిమ తో ముందుకు సాగుతూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక ఎమ్మార్వో చల్లా ప్రసాద్ కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ విషయంపై ఈ విషయంపై ఎమ్మార్వో మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతానని మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం అశ్వరావుపేట మండల నాయకులు
గుమ్మడి అప్పన్న, అల్లాడి నారాయణ, యూత్ ప్రెసిడెంట్ బుక్కురి బుజ్జిబాబు, గుమ్మడి ఆదినారాయణ, యూత్ సెక్రటరీ తలుపుల నాగేశ్వరరావు, కోశాధికారి గాడి చర్ల శ్రీను రాయల కృష్ణ, గుమ్మడి శ్రీను, టేకు చిన్ని లతోపాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.