చారిత్రాత్మక సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 28 (): కేంద్రప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రెండురోజుల పాటు చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లంక రాఘవులు పిలుపునిచ్చారు. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 21 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికుల హక్కుల చట్టాలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కేంద్రం కార్మికుల  ఉద్యోగ భద్రతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా 48 గంటల పాటు నిర్వహించే చారిత్రాత్మిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.