చాలాకాలం తరవాత మళ్లీ తెరపైకి వేణ
నటుడు వేణు తొట్టెంపూడి ’స్వయంవరం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరు నవ్వుతో, గోపి గోపిక.. గోదావరి వంటి చిత్రాల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. తనదైన శైలిలో ఫిలాసఫి డైలాగ్‌లు చెబుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా వంటి సినిమాల్లో సహానటుడిగా కామెడీ పండిస్తూ ప్రేక్షకలును ఆకట్టుకున్నాడు. అలా హీరోగా, కమెడియన్‌గా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. చివరిగా దమ్ము, రామాచారి చిత్రాల్లో కనిపించిన ఆయన ఆకస్మాత్తుగా తెరపై కనుమరుగయ్యాడు. దాదాపు పదేళ్ల తర్వాత వేణు రవితేజ రామారావు ఆన్‌డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలోని వేణు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అతడు సీఐ మురళిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో వేణు సోషల్ విూడియా
వేదికగా ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రామారావు ఆన్‌డ్యూటీ మేకర్స్ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నా. మళ్లీ ఇంతకాలానికి రామారావు ఆన్‌డ్యూటీతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను సీఐ మురళిగా కనిపిస్తాను. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది.