చాలు సారూ…సెలవు విూకు


నమ్మకంగా వచ్చి నట్టేట ముంచి
జగన్‌ ఐదేళ్ల పాలన విధ్వంసంతో మొదలు
దెబ్బతినని రంగా లేవు..నష్టపోని వ్యక్తి లేడు
అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఒక్క ఛాన్సు ఇవ్వండి.., మాట తప్పను, మడమ తిప్పను అంటూ అదేపనిగా చెప్పుకొని 2019లో గద్దెనెక్కిన జగన్‌.. అక్కడికెళ్లాక మాట తప్పాడు. ప్రజావేదిక కూల్చవేత తోనే తప్పటడుగులు వేశారు. రాజధానిని లేకుండా చేశారు. భూములు ఇచ్చిన ప్రజలను ఆగం చేశారు. ఆందోలన చేస్తున్నా ఒకక ఓదార్పు లేకుండా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రజలను దూరం పెట్టాడు. ఏపీ అభివృద్ధిని పాతాళం వైపునకు తీసుకెళ్లాడు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్ర నేలను కరవు సీమగా మార్చాడు. నిరుద్యోగులు, ఉద్యోగులను కష్టాల కొలిమి పాల్జేశాడు. ఎటుచూసినా అక్రమాలకు, అవినీతికి కేరాఫ్‌ అడ్రెస్‌గా మారాడు. నెత్తిన పెట్టుకొన్న ఓటర్లు ఊర్కొంటారా! రాష్టాన్న్రి పట్టించుకోక.. ప్రజల సమస్యలు తీర్చక.. ఆకాశమే హద్దుగా విధ్వంస పాలనకు తెగబడిన అక్రమార్కుడికి బుద్ధి చెబుతూ, 151 ఇచ్చిన వారే నేల విూదకు దించారు. ఓ రాష్టాన్రికి రాజధాని ఏదో తెలియకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి!
ఇది వినడానికే విడ్డూరం! కానీ ఇదే జరిగింది. ఏపీకి ఇది జగన్‌ చేసిన మోసం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ’అమరావతికి సై’ అన్న జగన్‌.. పీఠమెక్కాక మూడు రాజధానులు అంటూ కొత్తపల్లవి అందుకున్నారు. ’పరిపాలన వికేంద్రీకరణ’, ’అభివృద్ధి’ అంటూ మాయమాటలు చెప్పారు. మాటల కోటలే కానీ అభివృద్ధి దిశగా అడుగు వేసింది లేదు. దాంతో ప్రజా రాజధాని అమరావతిని ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారింది. పాలనా రాజధానిగా విశాఖని పిలిచి అక్కడ చేసిందేంటంటే.. భూముల పందేరం. కనిపించిన చోటల్లా కబ్జాలు చేయడం. ప్రశాంత విశాఖ చుట్టుపక్కల చాలా భూములు ఇప్పుడు వైకాపా నాయకుల చేతుల్లో ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. అమరావతినీ, ఉత్తరాంధ్రనీ తిరోగమనం దిశగా మళ్లించిన జగన్‌.. న్యాయ రాజధాని అంటూ కర్నూలు జనాలనూ మభ్యపెట్టారు. తానాడిన ఈ మూడు ముక్కలాటలో ప్రజలు తాత్కాలికంగా వెనకడుగు వేసి ఉండొచ్చు. కానీ ఓటేసే సమయం వచ్చీరాగానే.. ప్రభుత్వంపై వేటు వేసేశారు. ’ఇలా బటన్‌ నొక్కడం, విూ ఖాతాలోకి డబ్బులు రావడం’ అంటూ గత ఐదేళ్లుగా జగన్‌ నెలకోసారి బటన్‌ నొక్కుతూనే ఉన్నారు. పథకం ఏదయినా అది కామన్‌. ’సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల్ని విూ ఖాతాలో వేశాం’ అని గొప్పలు చెప్పుకొన్నారు. కానీ పావలా ఇచ్చి రెండ్రూపాయలు దోచేసే పద్ధతుల్ని అమల్లో పెట్టారు. దశల వారీగా మద్యనిషేధం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని నాసిరకం, హానికరమైన మద్యంతో రాష్టాన్ని నింపేసి.. ఎందరో మరణాలకు కారణమయ్యారు. ప్రభుత్వ ఖజానా నింపుకొన్నారు. చెత్తపన్ను వేసిన గొప్ప ప్రభుత్వమూ ఇదే! పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఏపీలోనే అత్యధికం. ఇక ’వాహన మిత్ర’ని చూడండి. ఉదయం డబ్బులు పడతాయి. సాయంత్రానికల్లా పన్నుల బాదుడు. ’విూరిచ్చే డబ్బులు మా ఆటోలు, కార్లు, వాహనాల రిపేర్లకే సరిపోవడం లేదు. మంచి రోడ్లు వేసి కాపాడండి మొర్రో’ అని ప్రజలు అదేపనిగా హారన్‌ కొట్టినట్టు వేడుకున్నారు. ’ప్రతి నెలా డబ్బులు వేశాను.. ఇక జనాలు ఓట్లు వేయడం ఒక్కటే బాకీ..’ అనుకుంటూ ఇన్నేళ్లు కలలు కన్న జగన్‌కు ’అభివృద్ధి’ అనే పదమే తెలియదు. ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని ప్రారంభోత్సవం చేశారా? చంద్రబాబు ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిన పనులు, ప్రాజెక్టులకు మరోసారి పునాదులు వేశారు. ఒకవేళ అప్పటికే ఆ పని పూర్తయి పోయుంటే ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధి అంటే వైకాపా నాయకులకు మాత్రమే ` అనేలా వ్యవహరించడంతో.. ఓట్లలో, సీట్లలో బాగా కోత పడిరది.
గత ఎన్నికలకు ముందు జగన్‌ ప్రజల మధ్యకి పాదయాత్ర అంటూ వచ్చారు. ’నేను విూ అన్నని’, ’విూ మామని’, ’విూ బిడ్డని’ అంటూ ప్రజల్ని హత్తుకున్నారు. ఎన్నో హావిూలిచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా అలానే ప్రజల మధ్యకు వెళ్లి కష్టాలు వింటారేమో అనుకున్నారు. ’సీఎం’ కాగానే కామన్‌ మ్యాన్‌ను మరిచిపోయారు. తాడేపల్లి ప్యాలెస్‌నే ప్రపంచమనీ, అందులోని వారే జనాలనీ అనుకున్నారు. ఆయన బయటికొచ్చినా ప్రజలకు భయమే. ’దొరగారు బయటకు రాకపోవడమే బెటర్‌’ అనుకున్నారు. ఎందుకంటే సార్‌ బయటికొస్తే జనాలకు బస్సులు ఉండవు. పచ్చని చెట్లను నరికేస్తారు. హెలికాప్టర్‌లో వెళ్తున్నా.. కింద నేలపై గంటల కొద్దీ ట్రాఫిక్‌ ఆపేస్తారు. ఇదంతా చూసిన ప్రజలు ’మా బాధ పట్టని వాడికి మేమెందుకు ఓటు వేయాలి’ అనుకున్నారు. లెక్క సరిచేశారు. ’విూరే నా కుటుంబం.. విూ కోసమే నేను’ అంటూ 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు బోలెడు. ఇదంతా నమ్మిన జనాలకు ఓటేశాక అసలు కథ తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సొంత బాబాయి వైఎస్‌ వివేకా హత్య కేసు విషయంలో ప్లేటు ఫిరాయించారు. ’నిందితులకు కచ్చితంగా శిక్షపడాలి’ అని చెప్పిన నోరు ఒక్కసారిగా మూగబోయింది. తల్లి విజయమ్మను పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు.
సోదరి షర్మిలను పొగబెట్టి బయటకు పంపేశారు. ఇక ’అన్నా న్యాయం పక్కన నిలబడు’ అంటూ వచ్చిన వివేకా తనయ సునీతా రెడ్డి విూద ’సొంతవాళ్ల’తో నానా మాటలు అనిపించాడు. ఆఖరికి ఇద్దరు చెª`లలెళ్లు రోª`డడెక్కి ’కొంగుచాపి’ మాకు న్యాయం చేయమని వేడుకున్నారు. ’రాజధర్మమైనా పాటించు’ వివేకా భార్య కోరారు. ఇవేవీ జగన్‌ మనసుని కరిగించలేదు. ఇలాంటి పాషాణ హృదయుడు మాకు వద్దంటూ పదవి నుంచి దించేశారు. తాను తప్పు చేసి.. చుట్టూ ఉన్నవాళ్ల విూద నెట్టేసి, పక్కన పెట్టేసే వాళ్లను చూశారా? దీనికి నిలువెత్తు ఉదాహరణ వైఎస్‌ జగనే. ఆ గుణమే ఆయన్ను ఇప్పుడు సీఎం పదవి నుంచి కిందకు దింపేసింది. అసమర్థ, అవినీతి పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది అనే విషయం పసిగట్టిన జగన్‌.. తాను మారకుండా, తన పార్టీ అభ్యర్థులను మార్చారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు. పక్క జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్‌లను చేశారు. అందుకు ఓ ఉదాహరణ నెల్లూరు నుంచి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను తీసుకొచ్చి నరసరావుపేటలో నిలబెట్టారు. ఇంతలా అభ్యర్థులను మార్చి ఏమార్చాలని చూసినా ’ఇక చాలు’ జగన్‌ అని ఓటర్లు చెప్పేశారు. ఉద్యోగాల సంగతి చెప్పాలంటే.. సరేసరి. వచ్చీ రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు వేసేశాం అంటుంటారు. అవి ఎక్కడ, ఏవి, ఎలాంటివి అనే మాట చెప్పరు. ఉద్యోగ ప్రకటనలు, నోటిఫికేషన్లు అయినా ఇచ్చారా అంటే? అవీ లేవు. మెగా డీఎస్సీ అని ఎన్నికలకు ముందు ఓ దగా డీఎస్సీ వేశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల సంగతి సరేసరి. ఇక ప్రైవేటు కంపెనీలు ఏమైనా వచ్చేలా చేశారా అంటే అదీలేదు. అప్పటికే స్థిరపడిన కంపెనీలను, వస్తాయని చెప్పిన వాటిని బెదిరించి భయపెట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం అందుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి పరిస్థితి ఏపీలో గత ఐదేళ్లలో లేదు.