చింతూరు వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌

కొత్తగూడెం,ఆగస్టు 21(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ మంగళవారం అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 53 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో.. ముందస్తు చర్యలుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ, హనుమంతు సెక్టోరియల్‌ అధికారులను, తహశీల్దారులను ఆదేశించారు. ఇదిలావుంటేఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వారికి సేవలందించాలన్నారు. ఎలాంటి నష్టాలు చోటుచేసుకోక ముందే పోలీసులు పర్యటించి అక్కడి పరిస్థితులను సవిూక్షించాలన్నారు. సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వరద సహాయ చర్యల్లో పాల్గొని ప్రజల్లో నమ్మకం పెరిగేలా పని చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులకుఅక్కడి సమస్యలను తెలియచేసి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.