చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన
గోదావరిఖని : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించడంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనికి చెందిన ఆరెళ్లి రమేష్(40) అనే వ్యక్తి సోమవారం కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రిలో ఉన్న రమేష్ ఈ రోజు ఉదయం మృతిచెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే రమేష్ చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.