చికెన్ సెంటర్ల కు నోటీసులు జారీ

ములుగు
గోవిందరావుపేట సెప్టెంబర్ 20( జనం సాక్షి) :-

పస్రా గ్రామంలోని మేడారం వెళ్లే రహదారిలో ఆర్ అండ్ బి రోడ్డు మీద విక్రయాలు నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లకు పసర గ్రామ పంచాయతీ కార్యదర్శి సోమవారం నోటీసులు జారీ చేశారు. మేడారం వెళ్లే భక్తుల వాహనాలకు మరియు ప్రజలు నడవడానికి ఇబ్బందిగా ఉన్నందున రోడ్డుపై స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించడం చట్టవిరుద్ధమని నోటీసు ముట్టిన మూడు రోజులలో డ్రైనేజీ కి లోపల సొంత సెటర్ లేదా స్థలంలో నిర్వహించుకోవాలని లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి నోటీసులో పేర్కొన్నారు. అయితే వివరాల్లోకి వెళితే  కొద్ది రోజుల క్రితం జరిగిన   గ్రామ సభలో ప్రజలు నడిరోడ్డుపై మేడారం రోడ్డులో చికెన్ సెంటర్ లు నిర్వహిస్తున్నారని అభ్యంతరాలు తెలపడంతో గ్రామ సభలో చికెన్ సెంటర్ లను రోడ్లపై నుండి తొలగించేలా గ్రామస్థుల ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. గ్రామ సభలో చేసిన తీర్మానం ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సోమవారం చికెన్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో చికెన్ సెంటర్ల నిర్వాహకులకు రోడ్లపై విక్రయాలు చేయ వద్దని చెప్పినా కూడా మళ్లీ మళ్లీ అదే విక్రయాలు కొనసాగిస్తున్నారు ఈసారైనా సమస్యకు పరిష్కారం కోసం  గ్రామంలోని ప్రజలు కోరుకుంటున్నారు.

ఫోటో రైట్ అప్: ఆర్అండ్బి రోడ్డుపై విక్రయాలు కొనసాగిస్తున్న చికెన్ సెంటర్లు

Attachments area