చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల చలనం

సహజనటిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు
నటి జయసుధ ప్రత్యేకతే వేరు
సహజనటనకు మారుపేరు జయసుధ. పద్నాలుగేళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయసుధ. 1972లో వచ్చిన ’పండంటి కాపురం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనతి కాలంలోనే అప్పటి అగ్ర కథానాయకులతో జోడీ కట్టి స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. ఐదు దశాబ్దాల పాటు నటిగా ఎన్నో వైవిధ్య భరిత పాత్రలు పోషించి పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గుడుపుతుంది. కాగా తాజాగా జయసుధ ఓ ఇంటర్వూలో తన 50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశానని చెప్పింది. అంతేకాకుండా ఇండస్టీప్రై, హీరోయిన్‌లపై వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.’50ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ప్లవర్‌ బొకేలైనా పంపేవారని, ఇక్కడ ప్లవర్‌ బొకేలు కూడా పంపించినవారు లేరని.. అదే హీరోలకైతే హడావిడి చేశారని’ తెలిపింది. చాలా మంది తనతో విూరెందుకు పెద్ద పార్టీ ఇచ్చి 50 ఏళ్ళ సక్సెస్‌ ఫుల్‌ జర్నీను సెలబ్రెట్‌ చేసుకోకూడదని అన్నారని , కానీ తనకది వద్దని అనిపిందని తెలిపింది. స్టార్‌ హీరోయిన్‌ అయినా వివక్ష ఉంటుందని.. తను ఎక్కువగా డిమాండ్‌ చేసిన, ట్రబుల్‌ చేసిన 50ఏళ్ళు తనను ఇండస్ట్రీలో ఉంచేవారు కాదని తెలిపింది. టాలీవుడ్‌లోకి ముంబై నుండి హీరోయిన్‌ వస్తే ఒకలా ట్రీట్‌ చేస్తారని, కుక్క పిల్లకు కూడా ఒక రూమ్‌ ఇస్తారని సంచలన విషయాలను చెప్పింది. కంగానా రనౌత్‌కు పద్మశ్రీ ఇచ్చారని..
అలాంటప్పుడు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉంటున్న తనకు ఎందుకు పద్మశ్రీ ఇవ్వలేదని చాలా మంది అడిగినట్లు తెలిపింది. అంతేకాకుండా మా బిల్డింగ్‌ గురించి, పాలిటిక్స్‌ గురించి కూడా పలు విషయాలను ఈ ఇంటర్వూలో తెలిపింది.

తాజావార్తలు