చిదంబరానికి చుక్కెదురు
చైన్నై:కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరానికి గురువారం మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలౌన పిటిషన్ తోసిపుచ్చాలని చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టివేసింది. విచారణను ఎదుర్కొవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2009 ఎన్నికల్లో శివగంగనియోజకవర్గం నుంచి చిదంబరం కేవలం 3,345 ఓట్ల తేడతో వజయం సాధించారు. అప్పట్లో ఆయన విజయం చాలా అనుమానాలు తలెత్తాయి. నిటి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అందు వల్లే ఆయన విజయం సాధించారని రాజా కన్నప్పన్ పిటిషన్ దాఖలు చేశారు. అన్నా డీఎంకే అభ్యర్థిగా శివగంగా పార్లమెంట్ నియోజకర్గంలో పోటీ చేసిన ఆయన చిదంబరం నియోజకర్గంలో పోటి చేసిన ఆయన చిదంబరం చేతిలో స్పల్ప తేడాతో ఓటమి చిందారు. దీంతో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ..ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వివిధ బ్యాంకుల నుంచి నిధులు సమీకరించి చిదంబరం ఎన్నికల సమయంలో ఖర్చు చేశారని పిటిషన్‌లో ఆరోపించారు.తన ఎన్నికను సవాల్‌చేస్తూ రాజా కన్నప్పన్ చేస్తుకున్న పిటిషన్ తిరప్కరించాలంటూ చిదంబరం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అయితే ఆయన పిటిషన్ న్యాయస్థానం తిరస్కరించింది. రాజా కన్నప్పన్ పిటిషన్‌ను చిదంబరం ఎదుర్కొవాల్సిందేనని జస్టిస్ కె.వెంకలరామన్ స్పష్టం చేశారు. అయితే,రాజా కన్నప్పన్ వేసిన పిటిషన్‌లో పెర్కొన్న కొన్ని అభియోగా3లను (బ్యాంక్ నుంచి నిధుల సేకరణ) తొలగించింది. మొత్తం 29 అవినీతి ఆరోపణలతో దాఖలైన రెండు పిటిషన్‌న్లలోని రెండు అభియోగాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.బిగతా 27 అభియోగాలపై చిదంబరం విచారణను ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. హోం మంత్రి చిదంబరం ఎన్నికపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచిరణకు స్వీకరించిన నేపథ్యంలో.. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలగాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. తన పదవికి రాజీనాయా చేసి, విచారణకు సహకరించాలని ఆయన కోరారు. చిదంబరంపై కొంతకాలంగా పోరాటం చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామికి తాజా పరిణామం కలిసి వచ్చింది, గతంలో 2జీ కేసులో ఆయన చిదంబరంపై తీవ్రంగా న్యాయ పోరాటం చేసిన సంగతి తెలిసిందే.