చిన్నారి కళ్లలో నుంచి కట్టెపుల్లలు, రాత్రంతా తీసిన పేరెంట్స్
కరీంనగర్: పదమూడేళ్ల బాలిక కళ్లలో నుంచి చిన్న చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీకి చెందిన దుర్సేటి రవి – లత కూతురు శివాని స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గత మంగళవారం రాత్రి శివాని ఒక్కసారిగా తనకు కళ్లు నొప్పి పెడుతున్నాయని ఏడ్చింది. అదే సమయంలో కంట్లో నుంచి చిన్న చిన్న కట్టెపుల్లలు బయటకు వచ్చాయి. స్నేహితులు పాఠశాలలోనే పుల్లలను తీశారు. ఆ తర్వాత కాసేపటికి ఆగిపోయాయి. శివాని ఇంటికి వచ్చి ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వారు దానిని కొట్టి పారేశారు. తిరిగి ఆదివారం రాత్రి పది గంటలకు రెండు కళ్లు మళ్లీ నొప్పి పెట్టాయి. మళ్లీ రెండు కళ్లలో నుంచి కట్టెపుల్లలు వచ్చాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ఆదివారం రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కంటిలో నుంచి పుల్లలు రాగా వాటిని తీసేశారు. తిరిగి సోమవారం ఉదయం చూసేసరికి కంటి నిండా కట్టె పుల్లలు ఉన్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు కట్టెపుల్లలు వస్తూనే ఉన్నాయి. మొత్తం 32 కట్టెపుల్లలు వచ్చాయి. ఎడమ కన్ను నుంచి ఎక్కువ కట్టెపుల్లలు వచ్చాయి. కళ్లు మంటలు మండుతున్నాయని చిన్నారి ఏడుస్తోంది. ఆమెను వైద్యుల వద్దకు తీసుకు వెళ్లారు. వైద్యుడు శ్రీధర్ మాట్లాడుతూ… కళ్లలో నుంచి రాళ్లు రావడం సహజమని, కట్టె పుల్లలు రావడం మాత్రం అరుదైన సంఘటన అంటున్నారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదన్నారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు రాసిచ్చారు.