చిన్నారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు: జస్టిస్‌ ఘోషి

హైదరాబాద్‌:దేశ భవిత చిన్నారుల చేతుల్లోనే ఉందని, భవిషత్‌ సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులు వారేనని హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ న్యాయ సేవాధికార సంస్థ బాలల హక్కుల పరిరక్షణ పై హైదరాబాద్‌లో న్యాయవాదులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ అగ్రభాగాన నిలబెట్టే శక్తి చిన్నారులకే ఉందన్నారు. శిక్షణ పూర్తి చేపుకున్న న్యాయవాదులకు ప్రధాన న్యాయమూర్తి పీసీ ఘోష్‌ ధ్రువపత్రాలు ప్రధానం చేశారు. ఈ కారకయక్రమంలో జస్టిస్‌ నౌషద్‌ అలీ, బ్రహ్మ కుమారి సంస్థ డైరెక్టర్‌ బీకే కుల్‌దీవ్‌ బెహన్‌ తదితరులు పాల్గొన్నారు.