చిరు ధాన్యాలలో ఎక్కువ పోషక విలువలు

గరిడేపల్లి, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): తక్కువ ఖర్చు గల చిరు ధాన్యాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని కీతవారిగూడెం గ్రామ సర్పంచ్ కీత జ్యోతి  రామారావు అన్నారు. బుధవారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-1 లో పోషణ అభియాన్ మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కీత జ్యోతి రామారావు మాట్లాడుతూ చిన్న పిల్లలతో పాటు బాలింతలు గర్భిణీలు ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరు ధాన్యాలతో పాటు ఆకుకూరలు పండ్లు గుడ్లు  పాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. దానివల్ల వ్యాధి నిరోధక శక్తి  పెరగటమే కాక పలు రకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. పిల్లల వయసు ఎత్తు బరువు పెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ షేక్ మున్నీసా బేగం, కార్యదర్శి ధనమూర్తి, అంగన్వాడి టీచర్ బత్తిని సైదమ్మ , ఆయా కోదాటి భారతి, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.