చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి

హుజురాబాద్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో బుర్ర శ్రావణ్‌ అనే చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. బాధితుడి ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రావణ్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జమ్మికుంట పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.