చీటర్‌ను చితకబాదిన యువతి

హైదరాబాద్  (జ‌నంసాక్షి ): సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున, అక్కినేని అఖిల్ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తోన్న చీటర్‌ను ఓ యువతి చితకబాదింది. యువతులను మోసం చేస్తోన్న మోసగాన్ని పోలీసులకు అప్పగించింది. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.