చీటింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్, రిమాండ్

ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి లోన్ తీసుకున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఖానాపూర్ ఎస్సై రుక్మవార్ శంకర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే… 2008-09 సంవత్సరంలో ఖానాపూర్ పట్టణంలోని ప్రస్తుత తిమ్మాపూర్ ఎస్బిఐ శాఖలో అప్పట్లో మేనేజర్ గా పనిచేసిన  పెనబోడి సురేంద్ర, ఖానాపూర్ కు చెందిన గంధం సత్యనారాయణ ఇరువురు కలిసి పథకం ప్రకారం 2009 సంవత్సరంలో ఎస్ హెచ్ జి అనే గ్రూప్ పేరిట బ్యాంకులో అకౌంట్ లో ఓపెన్ చేశారని, అనంతరం కొందరు వ్యక్తులను సభ్యులుగా చూపెట్టి నకిలీ పత్రాలు సృష్టించి వారి సంతకాలను ఫోర్జరీ చేసి రూ.8,37,714/-డ్రా చేసి అట్టి డబ్బులను వారిద్దరూ సొంత ఖర్చులకు వాడుకున్నారన్నారు. ప్రస్తుతం ఖానాపూర్ ఎస్బిఐ తిమ్మాపూర్ శాఖ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి వీరి ఇరువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. చీటింగ్ చేసి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్సై తెలిపారు