చురుకుగా గాడ్‌ఫాదర్‌ షూటింగ్‌

ముంబైలో సల్మాన్‌తో ప్రత్యేక పాట షూట్‌
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న స్టైలిష్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ’గాడ్‌ఫాదర్‌’ . తమిళ దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్‌ హిట్‌ ’లూసిఫర్‌’ చిత్రానికి అఫీషియల్‌ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. నయనతార సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. చిరుకు కుడిభుజం లాంటి పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ చేస్తున్నారు. ఇటీవల ’ఆచార్య’ చిత్రంతో అభిమానుల్ని ఎంతగానో నిరాశపరిచిన నేపథ్యంలో ’గాడ్‌ఫాదర్‌’ విషయంలో చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోయిజం ఎలివేషన్స్‌, డైలాగ్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. తెలుగు నేటివిటీకి, చిరు ఇమేజ్‌ కు అనుగుణంగా ఒరిజినల్‌ వెర్షన్‌ లో స్వల్పంగా మార్పులు చేశారు. ఇటీవల విడుదలైన ’గాడ్‌ఫాదర్‌’ ఫస్ట్‌ లుక్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా బ్యాలెన్స్‌ షూటింగ్‌ను జూలై 28 నుంచి ముంబైలో ప్రారంభించి అక్కడే పూర్తి చేయబోతున్నారని సమాచారం. ఇటీవలే ఫ్యామిలీతో లాంగ్‌ వెకేషన్‌ కు వెళ్ళిన మెగాస్టార్‌ ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. వెంటనే మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలోని ’భోళాశంకర్‌’ చిత్రం తాజా షెడ్యూల్‌ పూర్తి చేశారు. రీసెంట్‌ గా మొదలైన బాబీ దర్శకత్వంలోని ’వాల్తేరు వీరయ్య’ చిత్రం తాజా షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది అవగానే ’గాడ్‌ఫాదర్‌’ బ్యాలెన్స్‌ షూట్‌ పూర్తి చేసేందుకు చిరు రెడీ అవబోతున్నారు. సల్మాన్‌ ఖాన్‌, చిరంజీవి కలయికలోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. సల్మాన్‌ ఖాన్‌ డేట్స్‌ కేటాయించడంతో ఈ నెల 28న ముంబైలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్టు టాక్‌. ఇదే షెడ్యూల్‌లో పెండిరగ్‌లో ఉన్న కొన్ని సీన్స్‌తో పాటు చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌లపై ఒక అదిరిపోయే పాటను కూడా చిత్రీకరించబోతున్నట్టు టాక్‌. ఈ పాటకోసం తమన్‌ ఇప్పటికే ఒక మాసీ, క్యాచీ ట్యూన్‌ను రెడీ చేశారని, దానికి చిరంజీవి ఎంతగానో ఇంప్రెస్‌ అయ్యారని తెలుస్తోంది. ఒరిజినల్‌ వెర్షన్‌ ’లూసిఫర్‌’ చిత్రం ª`లకైమాక్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీ వాలుస్చా డిసౌజా ఐటెమ్‌ సాంగ్‌ ఉంటుంది. విలన్‌ వివేక్‌ ఒబెరాయ్‌ భరతం పట్టడానికి మోహన్‌ లాల్‌ ఒక పబ్‌లో వెయిట్‌ చేస్తూంటారు. పాట అవగానే.. వివేక్‌ను షూట్‌ చేస్తారు. తెలుగు వెర్షన్‌ కోసం వాలుస్చా ఐటెమ్‌ సాంగ్‌ స్థానంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ల స్పెషల్‌ సాంగ్‌ వస్తుందని సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్‌ అవుతుందని చెబుతున్నారు.
…………………..