చురుగ్గా అయుత చండీయాగం ఏర్పాట్లు..

32uy6o6gమెదక్ : జిల్లా ఎర్రవెల్లిలో చండీయాగం ఏర్పాట్లు చివరిదశకు చేరాయి.. ఈ నెల 23న ఈ యాగం జరగబోతోంది.. సమయం తక్కువగా ఉండడంతో వేగంగా పనులు పూర్తిచేయిస్తున్నారు.. యాగ పరిసరాల్లో తుదిమెరుగులు దిద్దుతున్నారు.. క్రిస్టమస్‌కు వరుసగా సెలవులు రావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.. ఇందుకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రధానయాగశాలతో పాటు… వీవీపీపీలు బస కుటీరాలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు.. యాగానికివచ్చే భక్తులను కేటగిరీలవారీగా విభజించి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.. అలాగే రోజుకు దాదాపు 50వేలమంది యాగానికి వస్తారని అంచనా వేస్తున్నారు.. వీరందరికీ తీర్థప్రసాదాలు, భోజనంకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. అలాగే 2వేలమంది ఒకేసారి కుంకుమార్చన చేసేందుకు… అర్చన సామగ్రి ఉచితంగా ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు. మరోవైపు యాగానికిముందు పూజా కార్యక్రమాలను కేసీఆర్‌ దంపతులు మొదలు పెట్టారు.. యాగం ప్రాంగణంలో వీరితో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. యాగానికివచ్చే ప్రజలకోసం ప్రత్యేక సమాచారకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. అంబులెన్సులు, అగ్నిమాపక దళాలు, రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు.. పార్కింగ్‌కోసం 20 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.