చురుగ్గా మారిన అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం:రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోసరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నాడు.ఒడిశా నుంచి దక్షిణా తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి చురుగ్గా మారడంతో గురువారం సాయంత్రం నుంచే పలుచోట్ల వర్షాలు కురవడం మళ్లీ మొదలైనట్లు తెలిపారు.ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడిందని ఇది వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోకి వస్తే రాష్ట్రంలో వర్షాలు మరింత వూపందుకోవడానికి అవకాశాలుంటాయన్నారు.దీంతోపాటు పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని ఉపరితల ఆవర్తనం పూర్తిస్థాయిలో ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు మరింత పుంజుకుంటాయని వెల్లడించారు.