చురుగ్గా సాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులు
మండలం పరిధిలోని దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఎస్సీ కాలనీ వరకు గల సీసీ రోడ్డు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి.స్థానిక గ్రామ సర్పంచి కొన్యాల వెంకటేశం శనివారం రోడ్డు నిర్మాణం పనులను దగ్గరుండి పరిశీలించారు.రూ.20 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గుంతలమైన కంకర రోడ్డుతో కాలనీ వాసులు ఇన్నాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని వారన్నారు.ఇప్పటి వరకు గ్రామంలో 70 శాతానికి పైగా మురికి కాలువలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.వారి వెంట వెంకటేశం గుప్తా,సత్యనారాయణ తదితరులు ఉన్నారు.