చూచిరాతకు పాల్పడిన విద్యార్థులు డిబార్‌

చెన్నూరు రూరల్‌: మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం గ్రూప్‌ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 5 మంది విద్యార్థులను డిబార్‌ చేసినట్లు కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాలకృష్ణ మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.