చెక్కుల పంపిణీపై అధికారులకు సూచనలు

కామారెడ్డి,మే3(జ‌నం సాక్షి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, రైతు బంధు పథకం ద్వారా అందజేసే చెక్కుల పంపిణీ పకడ్బందీగా పంపీణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను  కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. ఎండలు విపరీతంగా ఉన్నందున రైతులకు వడదెబ్బ తగలకుండా మంచినీటి సౌకర్యం చేసుకోవాలన్నారు.  వడదెబ్బ ద్వారా ఎవరూ మరణించకుండా ఉండేందుకు ముందస్తు గా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా చే పట్టాల్సిన పనులపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.వడదెబ్బతో మరణించిన కు టుంబాలకు ఆపద్బందు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.  ఈ నెల 10 నుంచి పంపిణీ చేయనున్న పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు రైతులకు జీవిత కాలం ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కావున రెవెన్యూ అధికారులు పాస్‌ పుస్తకాలను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు నేరుగా అందజేయాలని ఆదేశించారు. రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్న చెక్కుల పంపిణీపై రైతులకు ముందస్తు సమాచారం అందించడంతో పాటు ఏ తేదీల్లో గ్రామ సభలకు హాజరు కావడం, వారు ఎలాంటి ఆధారాలు తీసుకురావాలో పోల్‌ చిటీల తరహాలో తెలియజేయాలన్నారు. బ్యాంకు అధికారులతో చర్చించి ఆయా బ్యాంకుల్లో రైతుల సంఖ్య వారికి అందజేసే ఆర్థిక సహా యం తదితర విషయాలను ముందస్తుగా సమాచారం అందించాలన్నారు.  హరితహారం కార్యక్రమంలో భాగంగా రైతుల అవసరాలకు అనుగుణంగా నర్సరీలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి జూలైలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. 
—————–