చెక్ పోస్టులు ప్రారంభం
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేట గ్రామంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును మార్కెట్ కమిటీ ఛైర్మన్ నారాయణరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే అక్రమ ధాన్య రవాణాను అరికట్టడానికి ఈ చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు
ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ ఛైర్మన్ ఆదిరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.