చెట్టుకు ఉరేసుకున్న అన్నదాత

సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామ శివారులో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు మొడకొక్కుల ఐలయ్య (45)గా పోలీసులు గుర్తించారు. ఐలయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారికి ఇటీవలే పెళ్లిళ్లు చేశాడు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన అతడు రెండేళ్లుగా నష్టాలను చవి చూశాడు. సుమారు రూ.5 లక్షల మేర అప్పుల పాలైన ఐలయ్య మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.