చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

నల్గొండ జిల్లా: నకిరేకల్‌ శివారులో జాతీయ రహదారిపై ఈ ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను నకిరేకల్‌ ఆసుపత్రికి తరలించారు.