చెట్లపొదల్లో పసికందు

కరీంనగర్‌, జనంసాక్షి: ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఓ పసికందును మానవత్వం లేని తల్లి చెట్ల పొదల్లో వదిలి వెళ్లిపోయింది. ఈ హృదయవిదారక ఘటన కోహెడ మండలం సముద్రాలలో చోటు చేసుకుంది. పసికందు ఏడుపును గమనించిన స్థానికులు ఆ చిన్నారిని చేరదీశారు. అనంతరం ఐసీడీఎస్‌ అధికారులకు చిన్నారిని అప్పగించారు.