చెత్తకుప్పలో పేలుడు

ఒకరికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ న్యాక్‌ సమీపంలో ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు పేలుడుకు గలకారణాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రప్పిస్తున్నారు. ప్రమాదానికి కారణం జిలెటిన్‌ స్టిక్స్‌ కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన స్వామిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వెద్యులు తెలిపారు.