చెత్తకుప్పలో మృతదేహం లభ్యం

– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో చెత్త కుప్పలో గుర్తు తెలియని మృతదేహం బయపడింది. బుధవారం ఉదయం మున్సిపల్‌ సిబ్బంది చెత్తను తొలగిస్తుండగా మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో, ఆ వ్యక్తి మృతిచెంది వారం రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరైన హత్య చేసి మృతదేహాన్ని చెత్తలో పూడ్చిపెట్టారా? లేదా మృతి చెందిన వ్యక్తిపై ఎవరినా చూడకుండా చెత్తను వేసారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.