చెత్తను వేరు చేయడంలో అవగాహన కలిగి ఉండాలి
పట్టణ ప్రజల తమ ఇండ్లలో వెలువడుతున్న చెత్తను మూడు రకాలుగా విభజించి పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని 4, 11, 13, 22, 33వ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు.చెత్తను వేరు చేయడంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. చెత్తను రోడ్లపై, మురికి కాలువల్లో వేయకుండా ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ వాహనాలకు తడి, పొడి, హానికరమైన చెత్తగా విభజించి ఇవ్వాలన్నారు.ప్రజలంతా పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్లు వట్టే రేణుక జానయ్య యాదవ్ , జాటోతూ లక్ష్మి మకట్ లాల్, కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, బండ జనార్ధన్ రెడ్డి, సురేష్, శివప్రసాద్,శానిటరీ జవాన్లు తదితరులు పాల్గొన్నారు.