చెన్నైలో 4 చోట్ల 50కిపైగా కరోనా కేసులు

7 మంది నర్సులకు పాజిటివ్‌
చెన్నై,ఆగస్ట్‌16(జనంసాక్షి): చెన్నై నగరంలో నాలుగు ప్రాంతాల్లో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో ఆరోగ్యశాఖ అధికారు లు ఆందోళన చెందుతున్నారు. వీరిలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 17 మంది నర్సులు కూడా ఉన్నారు. దీంతో వారుంటున్న మూడు క్వార్టర్స్‌లో ఉన్నవారికి కరోనా ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పులియంతోపు, చోళింగ నల్లూరు, కోడంబాక్కం, రాయపురం ప్రాంతాల్లో 50 మందికి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయట పడ్డాయి. పులియంతోపు ప్రాంతంలో జరిగిన ఆల య వేడుకల్లో జనాలు మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా పాల్గొనటంతో వీరిలో 50 మంది వైరస్‌ బారిన పడ్డారు. కోడంబాక్కం యోగాంబాళ్‌ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దంప తులకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌ లో ఉన్న వారికి పరీక్షలు జరపగా మరికొంతమందికి వైరస్‌ సోకినట్లు నిర్దారిం చారు. వీరిని నగరంలోని ప్రధాన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో అపార్ట్‌మెంట్‌ వాచ్‌ మాన్‌కు కూడా వైరస్‌ సోకింది. అతడికి కూడా వైద్యులు చికిత్సలందిస్తు న్నారు. చోళింగనల్లూరులోని ఓ రెసిడెన్షియల్‌ ఎª`లాట్‌లో 23 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఈ నాలుగు ప్రాంతాల్లో 200 మందికి పైగా కరోనా బాధితులున్నట్లు కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వీరికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

తాజావార్తలు