చెప్పెదొకటి..చేసేదొకటి…ఈటెల

హైదరాబాద్‌: చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతలేని పార్టీ అంటే టీడీపీనే అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ తెలిపారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు ఆయనను నమ్మరని పేర్కొన్నారు. బాబు ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు, తెలంగాణ ప్రజలు తెలంగాణను బలంగా కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. పార్టీలన్నీ మెనిఫెస్టో ప్రకటించినట్లుగానే తెలంగాణకు అనుకూలమని అఖిలపక్షం సమావేశంలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ నుంచి అఖిలపక్షానికి ఎవరిని పంపాలన్న విషయాన్ని పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్‌తో  కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదన్నారు.