చెరువులను కుంటలను పరిశీలించిన తాసిల్దార్
రుద్రంగి జూలై 24 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలోని హత్యాయకుంట అచ్చయ్య కుంట, గోలపు లొద్ది, నాగారం చెరువు లను తాసిల్దార్ భాస్కర్ ఆదివారం పరిశీలించారు.వీటి వలన ప్రస్తుతము ప్రజల ప్రాణాలకు మరియు ఆస్థి నష్టము జరిగే అవకాశము లేదన్నారు.ప్రస్తుతము రుద్రంగి మండలములో గర్భిని స్త్రీలు మండలంలోని రుద్రంగి గ్రామానికి చెందిన ఒద్యరపు మౌనిక 19.07.2022 రోజున సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరి అయినారు అలాగే కునుసోత్ అఖిల దేగావాత్ తండ గ్రామము యొక్క డెలివరీ తేది 27.07.2022 రోజున కలదు, వీరు ప్రస్తుత్తం నిజామాబాద్ లోని తల్లి గారి ఇంటి వద్ద ఉన్నారు. అలాగే మండలంలో ప్రస్తుతం ప్రజల రవాణాకు కూడ ఎలాంటి ఇబ్బంది లేవన్నారు.