చెరువులు తెలంగాణ వారసత్వ సంపద: హరీష్

minister harishrao participated in mission kakatiya

నిజామాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెరువులు మన రాష్ట్రంలో ఉన్నయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. నేడు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిగూడలోని సదాశివనగర్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇవాళ గొప్ప సుదినం. సీంఎ కేసీఆర్ చేతుల మీదుగా మిషన్ కాకతీయను ప్రారంభించడం చరిత్రలో నిలిచేరోజు. చెరువులు తెలంగాణ వారసత్వ సంపద. ఏ రాష్ట్రంలో లేని చెరువులు మన రాష్ట్రంలో ఉన్నయి. రాష్ట్రంలో మొత్తం 46,447 చెరువులు ఉన్నయి. ఈ ఏడు 9,573 చెరువులను పునురద్ధరణకు తీసుకున్నాం. ప్రతీ సంవత్సరం 20 శాతం చొప్పున చెరువుల పునరుద్ధరణ చేసుకుంటూ పోతాం. టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశాం.

చెరువులన్నింటినీ జలకళగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. రైతులు స్వచ్ఛందంగా చెరువులో తీసిన పూడిక మట్టిని పొలాల్లో పోసుకోవాలి. పూడికమట్టి పోసుకోవడం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గి 30 శాతం పంట దిగుబడి అధికంగా లభిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఎైట్లెతే పాల్గొని రాష్ట్రం సాధించుకున్నమో అదే విధంగా చెరువుల పునురుద్ధరణను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.