చెరువులో పడి బాలుని మృతి
కుంటాల: మండలంలోని అందాకూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి సాయిప్రసాద్ (8) అనే బాలుడు మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం చెరువు సమీపంలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టి ఈ ఉదయం చెరువులో మృతదేహాన్ని వెలికితీశారు.