చెరువుల పునరుద్ధరణకు ఓపెన్ టెండర్లు: సీఎం కేసీఆర్
నిజామాబాద్: గత పాలకులు చెరువుల అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెరువుల పునరుద్ధరణకు ఆన్‌లైన్‌లో ఓపెన్ టెండర్లు పిలుస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువు వద్ద ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ పైలాన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. అక్రమార్కులను ఉపేక్షించేది లేదని, నాణ్యత లేని పనులు చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. దొంగ కాంట్రాక్టర్లకు మళ్లీ కాంట్రాక్టులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చెరువుల పునరుద్ధరణ పూర్తయితే కరువు మన దగ్గరకు రాదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో కనిపించవద్దని, చెరువులు, కుంటల వెంటే ఉంటూ పనిచేయాలని ఆదేశించారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రతీ చెరువు కళకళలాడేలా తీర్చిదిద్దుతామని అన్నారు.