చెరువు నిర్మాణానికి భూమి పూజ

అసిఫాబాద్‌ : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రూ, 21,62 కోట్ల జేబీఐసీ నిధులతో చేపట్టనున్న చెరువు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు భూమి పూజ చేశారు. చెరువు నిర్మాణం పూర్తయితే 1420 ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.