చేతి గుర్తు మా చిహ్నం..చేసి చూపించడమే మా నైజం

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. చేతి గుర్తు మా చిహ్నం..చేసి చూపించడమే మా నైజం అని ట్వీట్ చేశారు. ‘కారు’కూతలు రావు’..జుటా’ మాటలు లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. పూర్తి ట్వీట్..

చేతి గుర్తు మా చిహ్నం.
చేసి చూపించడమే మా నైజం.

ఇచ్చిన మాట ప్రకారమే..
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే..
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో..
నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.

‘కారు’కూతలు రావు
‘జుటా’ మాటలు లేవు

మా మాట శిలాశాసనం..
మా బాట ప్రజా సంక్షేమం..

వస్తున్నాం తెలంగాణలోనూ ..
అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలను..
మోసుకొస్తున్నాం చిరునవ్వులను..
—————————————–