చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం: ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటు చేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే చేనేత కార్మికుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ 20 రోజులుగా ఆసాములు సమ్మె చేస్తుండటంతో పని లేక విశ్వనాథం అప్పుల పాలైయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో ఈరోజు ఉదయం ఇంట్లో ఉరేసుకుని
ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల సీఐ నాగేంద్రచారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.