చేనేత మిత్ర వెబి సైట్ వెంటనే పునరుద్ధరించాలి
మోత్కూరు అక్టోబర్ 7 జనంసాక్షి : గత రెండు నెలలు గా సాంకేతిక లోపంతో నిలిచిపోయిన చేనేత మిత్ర వెబ్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మోత్కూరులో పత్రికా ప్రతినిధుల తో మాట్లాడుతూ..చేనేత వృత్తిని ప్రోచహించెందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా నూలు పై 40/శాతం సబ్సిడీ, సాంకేతిక కారణాలతో గత రెండు నెలలుగా రాయితీ కోసం ధరకాస్తు చేసుకునే వెబి సైడ్ తెరుచుకోక పోవడంతో పథకం పూర్తిగా నిలిచిపోయిందని, పెరిగిన నూలు, రంగుల, రసాయాలతో, చేనేత కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అన్నారు. జియోట్యాగ్ కలిగిన వారికి మాత్రమే పథకం ఆమలు చేస్తున్నారని, అనుబంధ కార్మికులైన, నూలు అడ్డపోసేవారు, అచ్చుఅతికేవారు, రంగులు అద్దెవారు, కూడ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న, వారికి ఈ పథకం అమలు కావడం లేదని, వారికి అమలు చేయడంతో పాటు, వెబ్ సైడ్ ను వెంటనే తెరిపించి, నూలుపై 40/ శాతం సబ్సిడీ ప్రతి నెల కార్మికుల ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన చేనేత బీమా వయస్సు తో నిమిత్తం లేకుండా అమలు చెయ్యాలని, ఇండ్లు లేక షెడ్లలో పనిచేస్తున్న కార్మికులకు, స్థలం ఉంటే, హౌజ్ కం వర్క్ షేడ్ నిర్మించుకోవడానికి పది లక్షల ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాలడుగు చేనేత సహకార సంఘం మాజీ జెల్ల నాందేవ్, చింతకింది సోమరాజు, వడ్డేపల్లి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.