చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందుతున్న యువత

 ఇతర జంతువుల మాంసాహారంతో  పోల్చి చూస్తే చేపలు ఎక్కువ మాంస కృత్తులు మంచి పౌష్టికాహారం
కలిగి ఉంటుందని చేపల వినియోగం పెరగాలంటే వీటిని విలువగల ఉత్పత్తులుగా  మార్పు చేసి విక్రహించడం  ద్వారా  స్వయం ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు చేపల వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు నని ముత్తుకూరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్వంతి   కేవీకే గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త  సుగంధి లు అన్నారు. శనివారం కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతకు జాతీయ మస్త్య అభివృద్ధి మండలి  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద  సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్  సిస్టమ్  వారి  ఆర్ధిక సహకారం తో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా చేప ఉత్పత్తుల తయారీ వినియోగం పై యువతి యువకులకు చేపలతో విలువదరిత ఉత్పత్తుల  తయారీ విధానాల పై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చినట్లు తెలియజేసారు. ప్రస్తుతం  తెలంగాణా రాష్ట్రం లో చేపల సాగు బాగా పెరిగి అందరికి అందుబాటులో  ఉండి తినడానికి ఇష్ట పడిన వాటి ముళ్లంటే భయపడే వారు కొందరున్నారు కాబట్టి చేపలను ఎన్నో విలువైన ఉత్పత్తులుగా తయారు చేసి అమ్ముకోవడం ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చునని అన్నారు. ఇతర మాంసాహారాల వలె చేపల ద్వారా విలువైన ఉత్పత్తులయినటువంటి చేప  ముక్కలు చేప పిల్లేట్స్  చేప కైమా చేప వడియాలు మురుకులు చేప బాల్స్ కట్లెట్స్  వేపుడు పచ్చళ్ళు బజ్జీలు మొదలగునవి స్థానిక అవసరాలకు  అనుగుణంగా తయారు చేసుకోవచ్చునని  వీటిని తినడానికి బాగా ఇష్టపడుతారని  తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా  యువతీ యువకులు  చేప మాంసంతో తయారు చేసే వివిధ రకాల వంటకాలను తెలుసుకొని   ప్రాక్టికల్ గా చేపల  విలువదారిత   వంటకాలను  వండి నైపుణ్యం  పొందారని సీనియర్ శాస్త్రవేత్త కోర్స్ కోఆర్డినేటర్  లవకుమార్ తెలియజేశారు. ఇలా తయారు చేసుకొన్నచేప ఉత్పత్తులు నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చునని పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారని అన్నారు. ఈ కార్యక్రమంలో  సురేష్, బ్రహ్మానందం, రాజేష్, వెంకటయ్య, భద్రాచలం, సైదులు, నాగరాజు, కావేరి, మమత, మార్తమ్మ, సైదమ్మ,దుర్గా భవాని, గోపమ్మ, నిర్మల,సుమ, ఉషారాణి లతో పాటు 30 మంది పాల్గొన్నారు.

తాజావార్తలు