చేప పిల్లల ఉత్పత్తి కార్ప్ హాచేరీ యాజమాన్యంపై యువతకు శిక్షణ
ప్రేరెపిత ప్రజననం ద్వారా అవసరమైన చేప పిల్లల ఉత్పత్తి తో చేపల పెంపకం అధికోత్పత్తిని సాధించగలుగుతున్నామని పాలేరు మత్స్య పరిశోదన కేంద్రం శాస్త్రవేత్త రవీందర్ అన్నారు. శుక్రవారం కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక యువతకు జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారంతో సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ వారి సహకారం తో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా చేప పిల్లల ఉత్పత్తి హాచేరీ యాజమాన్యం పై అవగాహన కల్పించినట్లు తెలియజేసారు. కార్ప్ చేపల బ్రీడింగ్ కొరకు బ్రూడర్ చేపలను ఎంపిక చేసుకొని వాటిని ప్రత్యేకంగా పెంచుకోవడం ద్వారా కార్ప్ చేపల అండోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.ఆడ మగ చేపలు 1:1 సంఖ్య 1:2 నిష్పత్తి లో ఉండాలని రెండు సంవత్సర ముల వయసున్న పరిపక్వత చెందిన చేపలను బ్రీడింగ్ కు ఎంపిక చేసుకోవాలని అన్నారు . సింతటిక్ హార్మోన్స్ అయిన ఓవ ప్రీమ్ ఓవ టైడ్ ఓవాసిస్ లను తగు మోతాదు లో ఇంజక్షన్ ఇచ్చి చేప పిల్లల ఉత్పత్తిని పొందవచ్చునని తెలిపారు. పిదప బ్రీడింగ్ ట్యాంక్ లో నుండి గుడ్లను సేకరించుకొని హాచింగ్ పూల్ లోకి వదిలి స్పాన్ ను పొందవచ్చునని తదుపరి స్పాన్ ను నర్సరీ చెరువుల్లోకి వదిలి ఫ్రై ఫింగర్ లింగ్ దశ వరకు పెంచుకోవచ్చునని తెలిపారు.కార్ప్ హాచేరీ చిన్న పాటి రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువత కు కార్ప్ హాచేరీ విభాగాన్ని సందర్శించి ప్రాక్టికల్ గా అవగాహన కలిపించినట్లు కెవికె ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవకుమార్ తెలియజేశారు. ఈ శిక్షణ లో సురేష్, బ్రహ్మానందం, రాజేష్, వెంకటయ్య, భద్రాచలం, సైదులు, నాగరాజు, కావేరి, మమత, మార్తమ్మ, సైదమ్మ ,దుర్గా భవాని, గోపమ్మ, నిర్మల,సుమ, ఉష లతో పాటు 30 మంది పాల్గొన్నారు