చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తున్న ఆస్తమా బాధితులు
హైదరాబాద్ : మృగశిరకారై సందర్భంగా ఆస్తమా బాధితులకు ఇచ్చే చేప మందు ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి నిన్ననే పెద్దసంఖ్యలో ఆస్తమా బాధితులు హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. మధ్యాహ్నం 12.30 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. 32 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ చేయనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో ప్రత్యేకంగా రోజుకు 41 అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.