చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

నాంపల్లి (హైదరాబాద్‌): మృగశిర కార్తిని పురస్కరించుకొని బత్తిని సోదరులు ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్‌, ఆయన కూతురు అలకనందతో కలిసి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రసాదాన్ని అందజేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో 32 ప్రత్యేక కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అస్తమా బాధితులు అధిక సంఖ్యలో వచ్చారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు అల్పాహారం, భోజనం, మంచినీటితో పాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశాయి.