చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి” – డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చేర్యాల నియోజకవర్గం 2009లో పోయి ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల కొమురవెల్లి మండల ప్రజలు ఏసీపీ కార్యాలయానికి సిద్దిపేటకు, మద్దూరు దులిమిట్ట ప్రజలు హుస్నాబాద్ కు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కలెక్టర్ ఆఫీస్ తప్ప మిగిలిన అన్ని ఆఫీసులకు పోవడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కు అన్ని అర్హతలున్నాయన్నారు. ప్రజలకు ఈ ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత మూడు సంవత్సరాల నుండి అనేక ఉద్యమాల ద్వారా రెవెన్యూ డివిజన్ కావాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్థానికేతరుడైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేర్యాల ప్రజల సౌకర్యాల గురించి, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుండి తాను ధర్నాలు, రాస్తారోకోల ద్వారా గత మూడు సంవత్సరాల నుండి పోరాడుతున్నానన్నారు. బుధవారం సీఎం సభలో రామాయణం పేటను రెవెన్యూ డివిజన్ ప్రకటించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఎందుకు ప్రకటించడం లేదని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్న సిద్దిపేటను చేర్యాల ప్రజలు సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం వెంటనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.