చైనాలో భారీ వరదలు…కొట్టుకుపోయిన కార్లు

636015070423604328చైనా : దక్షిణ చైనాను వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. గ్వాంగ్జీ రాష్ట్రంతో పాటు జువాంగ్ అటానమస్ రీజియన్‌లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. రోడ్లు సముద్రాన్ని తలపించడంతో జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వరద నీటిలో పొలాలు మునిగిపోయాయి. ఖరీదైన కార్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. కార్లు ఒకదానినొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. దక్షిణ చైనా వర్షానికి రూ.400కోట్ల నష్టం వాటిల్లింది. వ్యక్తిగత ఆస్తులకు ఎక్కువ నష్టం వాటిల్లినిట్లు అంచనా. మరో రెండు రోజులు వర్షాలు ఖాయమని వాతావరణశాఖ ప్రకటించడంతో జనం భయాందోళనలో మునిగిపోయారు.