చైన్నై విజయలక్ష్యం 120 పరుగులు
కోల్‌కతా : ఐపీఎల్ లో భాగంగా శనివారం చైన్నై సూపర్‌కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే సాధించి ధోని సేన ముందు 120 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ఉంచింది. గంభీర్ 25,పఠాన్ 25, తివారి 13, దాస్ 19, నరైన్ 13పరుగులు చేశారు. చైన్నై బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. మోరిస్ ,బ్రేవో చెరో వికెట్ దక్కించుకున్నారు.