చొప్పదండి MLA క్యాంప్ ముట్టడించిన బీజేపీ నాయకులు
చొప్పదండి ,ఆగస్టు 23 (జనం సాక్షి) :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో అమలు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్ అధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయం ముట్టడి చేశారు. బిజెపి కార్యకర్తలు గేటు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్ళి ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. అనంతరం పోలీసులు అరెస్టు చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రకటనలకే పరిమితం అయ్యిందే తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని, నియోజకవర్గ వ్యాప్తంగా సామాన్యుడు డబుల్ బెడ్ రూమ్ గృహప్రవేశం చేయలేదని, ఐదేళ్లుగా రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని, పథకాలన్నీ brs కార్యకర్తలకే చెందుతున్నాయని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని
అనేక మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారనీ బీసీబంధు, మైనారిటీ బంధు, గిరిజన బంధు, గృహలక్ష్మి లాంటివి ప్రకటించారు కానీ ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వడం లేదనీ విమర్శించారు. కెసిఆర్
ఇవన్నీ ఎన్నికల కోసమే ప్రకటిస్తున్నారనీ, కెసిఆర్ మాటలకు చేతలకు పొంతన లేదనీ, కెసిఆర్ మోసపు మాటలు ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని, రాబోయే కాలంలో కెసిఆర్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి వైదరామానుజం, జాడి బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు బత్తిని ప్రశాంత్, సుదర్శన్ రెడ్డి, కొల అశోక్ నాయకులు మామిడిపల్లి చైతన్య, చిల్ల శ్రావణ్, గుర్రం సమర్, గుండేటి శివశంకర్, జిట్ట కుమార్, రోడ్డవెని రాజు, బైరగోని కిట్టు గౌడ్, రేండ్ల శ్రీనివాస్, తాటికొండ కుమార్, వడ్లూరి సుధాకర్, లింగంపల్లి కళ్యాణ్, వెంకటస్వామి, వీరేశం, సురేష్ , మహేష్, రాము, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.