జంగారెడ్డిగూడెంలో అత్యధిక వర్షపాతం

ఏలూరు, జూలై 29 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో జంగారెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉండ్రాజవరం మండలంలో 1 మి.మీ వర్షపాతం నమోదు అయింది. జిల్లాలో జూన్‌ 1వ తేదీ నుంచి ఇంత వరకూ 342 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 374 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.