జంగాల్ పేట్ ( ఖర్జీ )పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
బెల్లంపల్లి ,సెప్టెంబర్ 24,(జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం ఖర్జీ, జంగల్ పేట్, మన్నేగుడెం ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాలల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి డీజే పాటలకు డ్యాన్సులు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల్ పేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాజేశం, మన్నెగూడెం ప్రధానోపాధ్యాయురాలు పల్లవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర సంప్రదాయాన్ని గౌరవిస్తూ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కులమతాలకతీతంగా బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగిందని, ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలలో పాఠశాలల ఉపాధ్యాయురాళ్ళు ఎస్ రేణుక, జి మాధవి, మంగ,మాలతి, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.