జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ : తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ విద్యార్థి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతే ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉన్న భద్రతాసిబ్బంది. పలువురిని అరెస్టు చేసి సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు.