జగన్మోహన్ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లే : హరీష్
వరంగల్ : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లేనని తెలంగాణరాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్‌రావు అదివారం అన్నారు. అయన వరంగల్ జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 25న నల్గోండ జిల్లాలోని సూర్యాపేటలో జరిగే సమర భేరీ సభను విజయవంతం చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కోన్నట్లుగా తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని కోనలేరని ధ్వజమెత్తారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పట్టిన గతే అ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పడుతుందని ఘాటుగా హెచ్చరించారు. మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ సోదరి షర్మిలా రెడ్డి తెలంగాణపై పార్టీ వైఖరి ప్రకటించిన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు ఎందుకు వెళ్లారో మాజీ మంత్రి ; వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కోండా సురేఖ వివరణ ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.